స్టార్ హీరోలకి ధీటుగా బోక్స్ ఆఫీస్ వద్ద లేడి ఓరియంటెడ్ చిత్రాలతో సత్తా చాటుకున్న అనుష్క .. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి వంటి చిత్రాల్లో అద్భుతమైన నటనతో పాత్రలకు ప్రాణం సింది. తాజాగా `సైలెన్స్` అనే సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తుంది. గత ఏడాది కూడా `భాగమతి` తనదైన పాత్రలో ఎక్స్ట్రార్డినరీ విజయాన్ని అందుకున్నా జేజమ్మ చేస్తున్న సైలెన్స్ సినిమా తర్వాత .. ఓ భక్తి రస చిత్రంలో ప్రధాన పాత్రలో నటించనుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్శివన్ డైరెక్టర్గా అయ్యప్పస్వామిపై ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో అనుష్క కూడా కీలక పాత్రధారిగా నటించనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుండి సినిమా ప్రారంభమవుతుందని టాక్. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తారట.